Header Banner

సాక్షిపై వేసిన ప‌రువున‌ష్టం కేసులో కోర్టుకు లోకేష్! ఈ కేసేంటి? ఉదయం 10 గంటలకు!

  Wed Apr 09, 2025 14:53        Politics

సాక్షిలో త‌న‌పై రాసిన ఉద్దేశ‌పూర్వ‌క త‌ప్పుడు క‌థ‌నంపై నారా లోకేష్ న్యాయ‌పోరాటం కొన‌సాగుతోంది. గురువారం ఉదయం 10 గంటలకు విశాఖప‌ట్నం 12వ అడిష‌న‌ల్ జిల్లా కోర్టులో జ‌ర‌గ‌నున్న క్రాస్ ఎగ్జామినేష‌న్‌కు విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ హాజ‌ర‌వుతున్నారు. ఇప్ప‌టికే  ఓసారి క్రాస్ ఎగ్జామినేష‌న్ జ‌రిగింది. ఈ ద‌ఫా క్రాస్ ఎగ్జామినేష‌న్ పూర్తి కానుండ‌డంతో కేసు కీల‌క ద‌శ‌కు చేరనుంది.  మంత్రి లోకేశ్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు, న్యాయ‌వాదులు హాజ‌ర‌వుతున్నారు.

 

ఇది కూడా చదవండి: జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

కేసు నేప‌థ్యం ఇదీ..

2019 అక్టోబర్ 22న చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి శీర్షిక‌తో సాక్షి దినప‌త్రిక‌లో ఓ క‌ల్పిత కథనం ప్ర‌చురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్త‌వాలతో కూడినదని, ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న ప్ర‌తిష్ట‌ను మంట‌క‌ల‌పాల‌నే ఉద్దేశంతో దీనిని ప్రచురించారని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించారు. వారు ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వకపోవడం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో నారా లోకేశ్ త‌న న్యాయ‌వాదుల‌తో పరువునష్టం దావా వేశారు. ఆ కథనంలో పేర్కొన్న రోజులలో తాను విశాఖ‌లోనే లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల ఖ‌ర్చును త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్ర‌తిష్ట‌ని మ‌స‌క‌బార్చేందుకు చేసిన కుట్ర అని, దీనిపై విచారించి న్యాయం చేయాల‌ని కోర్టుని కోరారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting